Gold Prices Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమయిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధరలు దిగివస్తున్నాయి.

Update: 2026-03-20 04:00 GMT

బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ధరలు దిగివస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత బంగారం, వెండి ధరలు కొంత పెరిగినా.. తగ్గిన సమయంలో భారీగానే తగ్గుతుండటం కొంత వినియోగదారులకు ఊరట కలిగిస్తుంది. ఇలాగే కొనసాగితే బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు అందుబాటులో వస్తాయని అంచనాలు వినపడుతున్నాయి. ధరలు తగ్గుతుండటంతో జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లతో కళకళ లాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో మరింతగా కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.

అనిశ్చితి నేపథ్యంలో...
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,280 కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.7140 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,750 దగ్గర ఉంది.. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.6550 మేర తగ్గింది. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది.
నేడు కూడా తగ్గి...
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ధరలు తగ్గుతుండటంతో ఇంకా ధరలు తగ్గుతాయేమోనని కొనుగోలు దారులు చాలా మంది వేచి చూస్తున్నారు. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,740 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,270 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,64,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News