తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం సృష్టించింది

Update: 2026-03-20 08:17 GMT

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం సృష్టించింది. అయితే పామును చూసిన వెంటనే అక్కడ ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పాము రావడం కొంత కలకలం రేపింది.

పామును చూసిన...
పామును చూసిన వెంటనే అక్కడి వారు కొందరు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే అక్కడ కానిస్టేబుల్ ధైర్యం చేసి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును ఫారెస్ట్ అధికారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలిస్ అప్పగించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


Tags:    

Similar News