అందుకే ఆ పని చేశా: మొగులయ్య
ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య చిత్రాన్ని ప్రభుత్వం హైదరాబాద్
ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య చిత్రాన్ని ప్రభుత్వం హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద మెట్రో పిల్లర్ పై గీయించింది. ఈ చిత్రంపై కొందరు ప్రకటనల కాగితాలు అతికించి ఆపరిశుభ్రం చేశారు. దీన్ని గమనించిన మొగులయ్య తానే శుభ్రం చేసుకున్నారు. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా తన వర్ణ చిత్రం ప్రకటనల కాగితాలతో అపరిశుభ్రంగా కనిపించిందని మొగులయ్య తెలిపారు. మనసుకు బాధ అనిపించడంతో, ఒకాయన సాయం తీసుకొని నీళ్లు తీసుకొచ్చి కడిగానని మొగులయ్య వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.