మా అమ్మ కోరిక నెరవేర్చలేకపోయా

తెలంగాణ మంత్రి కేటీఆర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలని అమ్మ కోరుకుందని, కానీ కాలేకపోయానన్నారు.

Update: 2022-12-03 08:35 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలని అమ్మ కోరుకుందని, కానీ కాలేకపోయానన్నారు. ఏఐజీ ఆసుపత్రిలో ఉమెన్ ఇన్ మెడికల్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో వైద్య వృత్తికి ఎనలేని ప్రాధాన్యత ఉందన్నారు. దేవుడి తర్వాత వైద్యుడినే దేవుడిగా భావిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా సమయంలో...
కరోనా సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. కోవిడ్ సమయంలో ఏఐజీ ఆసుపత్రి చేసిన సేవలు మరచిపోలేమని ఆయన అన్నారు. అందుబాటు ధరలతోనే అందరికీ వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వైద్య వృత్తిలో మహిళలు రాణించడం ఆనందమని తెలిపారు. భారత్ లో జెండర్ టెక్నాలజీని పాటించే అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని మంత్రి కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News