తిరుపతికి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో

తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Update: 2025-06-19 03:30 GMT

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే శంషాబాద్ కు తరలించారు. తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ శంషాబాద్‍కు తిరుగు పయనం అయింది.. తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్ రావడంతో ఆందోళన నెకొంది.

ప్రయాణికుల ఆందోళన...
ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. విమానాన్ని తిరుపతికి వెళ్లకుండా తిరిగి శంషాబాద్ కు చేర్చడంతో ప్రయాణికులు తర్వాత ఫ్లైట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. స్పైస్ జెట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ వారు అక్కడ ఆందోళనకు దిగారు.


Tags:    

Similar News