Tilak Varma : కళ్ల ముందు దేశమే కనిపించింది

ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన కంటి ముందు దేశమే కనిపించిందని టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ అన్నారు.

Update: 2025-09-30 07:31 GMT

ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన కంటి ముందు దేశమే కనిపించిందని టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ అన్నారు. తిలక్ వర్మ ఈరోజు తాను హైదరాబాద్ లో శిక్షణ పొందిన క్రికెట్ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒత్తిడికి గురి కాలేదని, తన కళ్ల ముందు లక్ష్యం ఒకటేనని, అనుకున్న టార్గెట్ ను ఛేదించడమే పెట్టుకున్నానని తెలిపారు. తనను విరాట్ కోహ్లి తో పోల్చడం గర్వంగా ఉందని తిలక్ వర్మ తెలిపారు.

టీం అందరి శ్రమ...
పాక్ బౌలర్లు తనను అవుట్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అంది వచ్చిన బాల్ ను మాత్రమే ఫోర్, సిక్స్ కు తరలించగలిగానని అన్నారు. అలాగే సంజూ శాంసన్, శివమ్ దూబేలు కూడా ఫైనల్ మ్యాచ్ లో బాగా ఆడి సహకరించారన్నారు. ఇండియా విజయాని తన ఒక్కడి కృషి మాత్రమే కాదని టీం మొత్తం శ్రమ ఉందని తిలక్ వర్మ తెలిపారు. తాను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం తన కోచ్ ప్రధాన కారణమని, వారికి తాను ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు.


Tags:    

Similar News