సంక్రాంతికి పదహారు ప్రత్యేక రైళ్లు ఇవే
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 9వ తేదీ నుంచి 19 తేదీల మధ్య అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ రైళ్లలో వెళ్లే అవకాశముంది. హైదరాబాద్ నుంచి ఈ రైళ్లు బయలుదేరి వెళ్లనున్నాయి.
రైళ్లు ఇవే...
దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించిన పదహారు రైళ్లు సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ (07288), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07289), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07290), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07291), వికారాబాద్-శ్రీకాకుళం రోడ్(07294), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07295), సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్(07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07293)మార్గంలో ప్రయాణం చేయనున్నాయి.