Telangana : నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం జరగనుంది

Update: 2025-07-04 02:04 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం జరగనుంది. ఎల్.బి. స్టేడియంలో జరగనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. పీసీసీ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సభలో కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు.

అన్ని నియోజకవర్గాల నుంచి...
అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వందల మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని అగ్రనాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తమ ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం గురించి ఈ సభలో ప్రస్తావించనున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల విషయం వంటి వాటిపై నేతలు ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News