Hyderabad : పొగమంచుతో విమానాలు రద్దు

హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో పలు విమానాలు రద్దయ్యాయి.

Update: 2025-12-30 04:04 GMT

హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో పలు విమానాలు రద్దయ్యాయి. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దవ్వడంతో పాటు కొన్ని విమానాలను ఆలస్యంగా నడుపుతున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఉదయం నుంచి హైదరాబాద్ లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అనేక విమానాల రాకపోకలు...
పొగమంచు తీవ్రతకు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. పొగమంచు తగ్గిన తర్వాత మాత్రమే విమానాలు బయలుదేరే అవకాశం ఉందని విమాన యాన వర్గాలు చెబుతున్నాయి. మరొకవైపు హైదరాబాద్ కు చేరుకునే విమానాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో పాటు పొగమంచు ఎఫెక్ట్ తో ఢిల్లీ, చండీగఢ్‌, విశాఖ వెళ్లే విమాన సర్వీసులు రద్దయినట్లు ఆ యా సంస్థలు తెలిపాయి.


Tags:    

Similar News