Hyderabad : సంక్రాంతికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీ జేబులు లూటీ

సంక్రాంతి రద్దీతో ప్రైవేట్‌ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. ఛార్జీలు భారీగా పెంచారు.

Update: 2025-11-26 04:48 GMT

సంక్రాంతి రద్దీతో ప్రైవేట్‌ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. ఛార్జీలు భారీగా పెంచారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైళ్లు ఆలస్యంగా ప్రకటించడంతో ప్రయాణికులపై ఒత్తిడి పెరిగింది. ఎపీఎస్‌ఆర్టీసీ 50 శాతం మాత్రమే అదనపు ఛార్జీ వసూలు చేస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం రెండు నుంచి మూడు రెట్లు టిక్కెట్ల రేట్లు పెంచుతూ ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి పండగకు వెళ్లేందుకు సహజంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రయివేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్‌ బస్సుల చార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వైపు వెళ్లే రైలు, ఎపీఎస్‌ఆర్టీసీ బస్సుల టికెట్లు పూర్తిగా అమ్ముడవుతున్నాయి.

రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు...
రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు ముందస్తు రిజర్వేషన్ తో పూర్తిగా నిండిపోవడవంతో ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. రవాణా శాఖ, రైల్వే శాఖ ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్ల ప్రకటనను ఆలస్యం చేయడంతో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. జనవరి 9, 10 తేదీలకు టికెట్‌ బుకింగ్స్‌ ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి ేపీఎస్‌ఆర్టీసీ అయితే పండుగ అదనపు ఛార్జీలను యాబై శాతం వరకు మాత్రమే అమలు చేస్తోంది. అయితే ప్రైవేట్‌ బస్సులు మాత్రం రెండు–మూడు రెట్లు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. తరచూ ఫిర్యాదులు వచ్చినా రవాణాశాఖ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
విశాఖకు ఏడు వేలు...
ఇటీవల కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన హైదరాబాద్–బెంగళూరు ప్రైవేట్‌ బస్సు ప్రమాదం తర్వాత అధికారులు భద్రత, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లపై కొద్దిసేపు తనిఖీలు చేసినా, చార్జీలపైన నిరంతర పర్యవేక్షణ జరగలేదని ప్రయాణికులు అంటున్నారు. హైదరాబాద్–విశాఖపట్నం మార్గంలో ఎపీఎస్‌ఆర్టీసీ చార్జీ 1,889 రూపాయలు. అదే మార్గంలో ప్రైవేట్‌ బస్సులు ఒక్కొక్కరి నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు వసూలు చేస్తుంది. స్లీపర్ అయితే ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.హైదరాబాద్–రాజమహేంద్రవరం మార్గంలో ఎపీఎస్‌ఆర్టీసీ చార్జీలు సూపర్‌ లగ్జరీకి 1,032 నుంచి స్లీపర్‌కు 2,338 వరకు ఉన్నాయి. కానీ ప్రైవేట్‌ బస్సుల సీటర్‌ ఛార్జీలు 2,599–₹4,999, స్లీపర్‌ 5,999 వరకు ఉండటం ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నార.



Tags:    

Similar News