మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి సంపాదించింది ఎన్ని కోట్లంటే?

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పటి వరకూ ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు

Update: 2025-11-17 06:15 GMT

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పటి వరకూ ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరవై కోట్ల రూపాయలు సంపాదిస్తే అందులో మూడు కోట్ల రూపాయలను తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టాలీవుడ్, బాలీవుడ్ అనేక సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మలో పోస్టు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. కొత్త సినిమా విడుదలయిన వెంటనే సాయంత్రానికి వెబ్ సైట్ లో పెడుతున్నాడు. దీనివల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నాడు.

మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి అని...
మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి అని చెప్పారు. తొలి నుంచి ఇమ్మడి రవి క్రిమినల్ మైండ్ అని సజ్జనార్ చెప్పారు. దేశ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతున్న దశలో చాలా రోజుల నుంచి ఐబొమ్మ పై తాము దర్యాప్తు చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. 2019 నుంచి అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ నుంచి నెట్ వర్క్ ను ఐ బొమ్మను ఇమ్మడి రవి నిర్వహిస్తున్నాడని సజ్జనార్ తెలిపారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ ర్యాకెట్ ను నిర్వహిస్తున్నాడన్నారు. మరొకసారి పోలీస్ కస్టడీకి తీసుకుని అతని వెనక ఎవరు ఉన్నారన్న దానిపై విచారణ చేస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజులు పాల్గొన్నారు.


Tags:    

Similar News