Bus Accident : చనిపోయిన వారందరూ హైదరాబాదీలేనా?

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు

Update: 2025-11-17 07:40 GMT

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. సౌదీ బస్సు ప్రమాదంలో 42మంది చనిపోయారు. ఈ నెల 9న హైదరాబాద్‌ నుంచి మక్కాకు 54 మంది వెళ్లారు. 44 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్లారు. బస్సు డ్రైవర్ తో పాటు మహమ్మద్‌ షోయబ్‌ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు చనిపోయిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారేనని చెబుతున్నారు. మొత్తం యాభై నాలుగు మంది వెళ్లగా అందులో నలుగురు కారులో మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

ఈ నెల 23వ తేదీ వరకూ...
ఈ నెల 23 వరకు వారు అక్కడ పర్యటించాల్సి ఉంది. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి మక్కాకు బయలుదేరి వెళ్లారు. మల్లేపల్లి, బజార్ ఘాట్ కు చెందిన వారు కూడా కొందరు ఉన్నారని చెబుతున్నారు. రాత్రి నుంచి ఫోన్లలోకి కూడా అందుబాటులోకి రాకపోవడంతో మక్కా కు వెళ్లిన వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొంటడంతో మంటలు చెలరేగి 42 మంది సజీవ దహనమయ్యారు. డ్రైవర్ తో పాటు షోయబ్ అనే యువకుడు తప్ప మిగిలిన సజీవ దహనమయ్యారు.
చనిపోయిన వారిని...
హైదరాబాద్ లోని రెండు ట్రావెల్స్ నుంచి మక్కా కు టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్లారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మృతుల్లో హీమున్నీసా, రహత్‌ బీ, షేహనాబ్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్‌, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్‌, సోహైల్‌ మహ్మద్‌, మస్తాన్‌ మహ్మద్‌, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్‌ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, మహ్మద్‌ మంజూర్‌, మహ్మద్‌ అలీగా గుర్తించారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదం పట్ల మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే శరీరాలన్నీ పూర్తిగా కాలి బూడిద కావడంతో తెలంగాణ ప్రభుత్వం జెడ్డా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.






Tags:    

Similar News