ప్రముఖ గాయని రావు బాలసరస్వతి మృతి

ప్రముఖ గాయని రావు బాలసరస్వతి మృతి చెందారు.

Update: 2025-10-15 07:20 GMT

ప్రముఖ గాయని రావు బాలసరస్వతి మృతి చెందారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతి ఆనాటి వారికి అందరికీ సుపరిచితులే. చిన్న వయసు నుంచే ఆమె పాటలు పాడేవారు.

97 ఏళ్ల వయసులో...
రావు బాలసరస్వతి 1928లో జన్మించారు. ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారందరికీ రావు బాలసరస్వతి పరిచయం. సతీ అనుసూయ చిత్రంలో రావు బాలసరస్వతి తొలి పాటను పాడారు. అనంతరం ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రెండు వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో అవార్డులు, రివార్డులను ఆమె సాధించారు. రావు బాలసరస్వతి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News