రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొత్త చిత్రం ‘వారణాసి’ ప్రచార కార్యక్రమంలో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల ధార్మిక భావాలను దెబ్బతీసాయని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ఆయన చిరాకు వ్యక్తం చేస్తూ దేవుడిపై విశ్వాసం లేదని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారణాసి చిత్రం ప్రచారం సమయంలో...
చిన్నప్పుడు తన తండ్రి “హనుమంతుడు వెనకనుంచి నడిపిస్తాడు” అని చెప్పిన విషయాన్ని కూడా రాజమౌళి అక్కడ ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తమకు అభ్యంతరకరంగా అనిపించాయని వనరసేన తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రాజమౌళిలపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వానరసేన సభ్యులు కోరారు.