హైదరాబాదీలకు అలెర్ట్... బయటకు రావద్దు

హైదరాబాద్ ను వర్షం వదిలిపెట్టడం లేదు. భారీ వర్షం కురుస్తుంది. నిన్న కురిసిన వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయిపోయాయి.

Update: 2022-09-27 10:07 GMT

హైదరాబాద్ ను వర్షం వదిలిపెట్టడం లేదు. మేఘాలన్నీ కమ్ముకున్నాయి. భారీ వర్షం కురుస్తుంది. నిన్న కురిసిన వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయిపోయాయి. మరోసారి భారీ వర్షం మొదలయింది. దీంతో హైదరాబాద్ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఉదయం నుంచి ఎండకాసినా సాయంత్రం అయ్యేసరికి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

ఉరుములు మెరుపులతో...
నిన్న హైదరాబాద్ లో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. విద్యుత్తు సరఫరా అనేక ప్రాంతాల్లో నిలిచిపోయింది. ఇళ్లలోకి నీరు ప్రవేశిచండంతో ముసారాంబాగ్, మలక్ పేట, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ఎక్కడకక్కడ నిలిచిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా భారీ వర్షం మొదలు కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయింది. మరో మూడు గంటల పాటు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు


Tags:    

Similar News