Hyderabad : గణేశ్ లడ్డూనూ 51 లక్షలకు కొన్న వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

హైదరాబాద్ మైహోం భుజాలో లడ్డూ ధర రికార్డు స్థాయిని పలికింది.ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ చివరకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు

Update: 2025-09-04 11:31 GMT

హైదరాబాద్ లో గణేశ్ లడ్డూ వేలంలో ఎక్కువ మంది పాల్గొంటారు. అది తమ సెంటిమెంట్ గా భావిస్తారు. నవరాత్రులను పూజలందుకున్న గణనాధుడి వద్ద ఉంచిన లడ్డూకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అందులోనూ బాలాపూర్ లడ్డూ వేలం కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయిలో అమ్ముడవుతుంది. గణేశుడి వద్ద ఉంచిన లడ్డూను పది మందికి పంచి, తమ పొలాల్లో చల్లితే అష్టైశ్యర్యాలతో పాటు, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యాలు మంచిగా ఉంటాయని భావించి ఎంతైనా వేలంలో పాల్గొని లడ్డూను సొంతం చేసుకుంటారు.

రియల్ వ్యాపారంలో...
కానీ ఈసారి హైదరాబాద్ మైహోం భుజాలో లడ్డూ ధర రికార్డు స్థాయిని పలికింది. వేలంలో గణేశ్ లడ్డూను 51, 77,777 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. మైహోం భుజాలో జరిగిన వేలంలో అనేక మంది లడ్డూ కోసం పోటీ పడ్డారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ చివరకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. కొండపల్లి గణేశ్ ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందుకు చెందిన వారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనేక వెంచర్లను చేశారు. రియల్ రంగంలో రాణిస్తున్న కొండపల్లి గణేశ్ ఈ గణనాధుని లడ్డూను సొంతం చేసుకున్నారు.


Tags:    

Similar News