Hyderabad : రికార్డు స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం

హైదరాబాద్ లో గణేశ్ లడ్డూ ధర రికార్డు స్థాయి పలికింది.

Update: 2025-09-06 02:58 GMT

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం ప్రారంభమయింది. అయితే పదకొండు రోజులు ముగించుకున్న గణనాధుడి వద్ద లడ్డూను వేలాన్ని నగరంలో అనేక చోట్ల నిర్వహిస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలంతో మొదలయిన ప్రక్రియ నగరమంతా వ్యాపించింది. తాజాగా హైదరాబాద్ లో గణేశ్ లడ్డూ ధర రికార్డు స్థాయి పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ ధర రెండు కోట్ల రూపాయలకు పైగా పలికింది.

బండ్లగూడ జాగీర్ లోని...
హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్మండ్ విల్లావాసులు ఈ గణేశుడి లడ్డూ వేలాన్ని నిర్వహించారు. అయితే ఈ లడ్డూను 2,31,95,000 రూపాయలు పలికింది. గత ఏడాది ఇదే కమ్యునిటీలో 1.87 కోట్లు పలికిన లడ్డూ ధర నేడు రెండుకోట్ల రూపాయలకు పైగా పలికి మరో రికార్డును సృష్టించిందని చెప్పాలి. పాటలో దక్కించుకున్న వారి వివరాలు మాత్రం తెలియరాలేదు.


Tags:    

Similar News