Hyderabad : నేడు హైదరాబాద్ కు భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ తెలంగాణలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఆరు రోజుల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటిస్తారు. రాష్ట్రపతి తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
శీతాకాల విడిది కోసం...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, మేయర్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వస్తారు. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పర్యటించనున్నార. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.