21న హైదరాబాద్ కు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ లోని భారతీయ కళామహోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అనంతరం ఇక్కడి నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి బయలుదేరి వెళతారు. అక్కడ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
22న పుట్టపర్తికి ద్రౌపది ముర్ము...
22వ తేదీన పుట్టపర్తికి బయలుదేరి వెళతారు. దీంతో హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ పుట్టపర్తికి సంబంధించిన పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల వద్ద ఇప్పటికే కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహించాయి.