హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదులో పోస్టర్ల, ఫ్లెక్సీలు వెలిశాయి

Update: 2023-03-11 03:58 GMT

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదులో పోస్టర్ల, ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయనే చెప్పాలి. ఈడీ, సీబీఐలతో భారతీయ జనతా పార్టీ బెదిరింపు రాజకీయాలకు భయపడబోమంటూ పోస్టర్లు నగరంలో కనిపించాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు వెలియడం విశేషం.

అమిత్ షా వస్తున్న రోజు....
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. చివరిగా బై బై మోడీ అంటూ హాష్ టాగ్ తో పోస్టర్లు హైదారాబాద్ లో కనిపిస్తున్నాయి. ఈరోజు అమిత్ షా హైదరాబాద్ కు వస్తుండటంతో ఈ పోస్టర్లు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News