నేడు తెలంగాణాలో రాష్ట్రపతి.. ఆంక్షలివే

నేడు తెలంగాణాలో రాష్ట్రపతి.. ఆంక్షలివే

Update: 2025-12-19 02:42 GMT

draupadi murmu

నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశాన్ని సెక్షన్ 163 BNSS కింద నో-ఫ్లై , నో-డ్రోన్ జోన్‌ను ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, రాచకొండ కమిషనరేట్ యొక్క నోటిఫైడ్ లిమిట్స్ ఏరియాలో డ్రోన్లు, యూఏవీలు, రిమోట్లీ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ , పారాగ్లైడర్లు, బెలూన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరే ఇతర ఎగిరే వైమానిక వస్తువులను ఎగరవేయడం నిషేధించారు.

భద్రతను దృష్టిలో ఉంచుకుని...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శన ఉన్నందున భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఆ ప్రదేశాన్ని సెక్షన్ 163 BNSS కింద నో ఫ్లై, నో డ్రోన్ ఫ్లై ఏరియా గా ప్రకటించడం జరిగిందని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామోజీ ఫిల్మ్ సిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News