Gold Price Today : బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయిగా.. వామ్మో ఈ రేంజ్ లోనా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ ఇలా ధరలు పెరగలేదు. ఈ రేంజ్ లో ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుదలతో కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. బంగారం కేవలం అ లంకారం మాత్రమే కాదు.. ఇప్పుడు కొనడం కూడా కష్టంగా మారడంతో దానిని దూరం నుంచి చూసి ఆనందించడమే తప్ప కొనుగోలు చేయడం మాత్రం జరగని పని. ఇందుకోసం ధరలు దిగివస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం శక్తికి మించిన పనిగా మారుతుంది.
అనేక కారణాలతో...
బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది వేచి చూస్తున్నారు. ధరలు దిగివచ్చేంత వరకూ చూద్దామని భావిస్తున్నారు. అలాంటి వారికి బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ షాకిస్తున్నాయి. ధరలు ఇంతగా పెరగడంతో ఇక తగ్గే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి పతనం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా అధ్యక్షుడు విధించిన అదనపు సుంకాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగడం లేదు.
ఈరోజు ధరలు ఇవీ...
ఇక శుభకార్యాలు కూడా జరగకపోవడంతో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై తొమ్మిదివేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,520 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,22,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.