Supreme Court : నాగారం భూములపై సుప్రీంకోర్టు తీర్పు

తెలంగాణలోని హైదరాబాద్ శివారులో ఉన్న నాగారం భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది

Update: 2025-12-16 06:36 GMT

తెలంగాణలోని హైదరాబాద్ శివారులో ఉన్న నాగారం భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం లో భూదాన్ భూముల వ్యవహారంపై మల్లేష్ అనే వ్యక్తి వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీర్ల మల్లేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటీషన్ ను కొట్టివేసి...
అయితే నాగారంలోని ఈ భూములను ఐఏఎస్, ఐపీఎస్ లు కొనుగోలు చేశారు. దీనిపై హైకోర్టు ఆ పిటీషన్ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు అనుకూలంగా తీర్పు చెప్పింది. హైకోర్టుకు తీర్పును సవాల్ చేస్తూ బీర్ల మల్లేశ్ దాఖలు చేసిన పిటీషన్ ను ప్రాధమికదశలోనే కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఊరట లభించినట్లయింది.


Tags:    

Similar News