Gold Price Today : గోల్డ్ లవర్ కు ఇంతం కంటే మంచి గుడ్ న్యూస్ ఉంటుందా?
ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు భారీగా పతనమవుతాయని గత కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతుంది. అందుకే తమ వద్ద బంగారు ఆభరణాలను కూడా విక్రయించేందుకు అనేక మంది సిద్ధపడుతున్నారు. దీంతో బంగారం ధరలు కొద్దిగా తగ్గుతున్నట్లు కనిపించినప్పటికీ ఇంకా ధరలు అందుబాటులోకి రాలేదు. పది గ్రాముల బంగారం ధర ఇంకా లక్షా ముప్ఫయి వేల రూపాయలు మాత్రమే ఉంది. కిలో వెండి రెండు లక్షల పది వేల రూపాయల వరకూ ఉంది. ఇంత భారీగా ధరలు ఉండటంతో కొనుగోలు చేయడం అనవసరమన్న భావన ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అందుకే బంగారానికి దూరంగా ఉండిపోతున్నారు. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
ధరలు మరింత పెరుగుతాయని...
అయితే బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి భారీగా పతనమవ్వడంతో పాటు డాలర్ మరింత బలపడటం, రష్యా - ఉక్రెయిన్ కాల్పుల విరమణ వంటి కారణాలతో బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయి. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలి. ఇంకా పతనమవుతాయని భావిస్తే వృధా అని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి సమయం అని, వేచి చూస్తూపోతే ఇక ధరలు మరింత పెరిగి అందుబాటులో లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
ఇక పెట్టుబడి దారులు కూడా బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు భయపడిపోతున్నారు. అదే సమయంలో 2026 నాటికి బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పదిహేను వందల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,850 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,10,900 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.