నేటి నుంచి ఐబొమ్మ రవి కస్టడీ

ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది.

Update: 2025-12-18 03:56 GMT

ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. నాలుగు కేసుల్లో పన్నెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచి రవిని పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే పలు మార్లు ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. అనేక విషయాల్లో ఐ బొమ్మ రవి కొంత వరకూ క్లారిటీ ఇచ్చారు.

పన్నెండు రోజుల పాటు...
అయితే తాజాగా మరికొన్ని కేసుల్లో తమకు ఐబొమ్మ రవిని కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరడంతో అందుకు కోర్టు అనుమతించింది. పన్నెండు రోజుల పాటు పోలీసులు ఐబొమ్మ రవిని విచారించనున్నారు. ఒక్కో కేసులో 3రోజులు నాంపల్లి కోర్టు విచారించాలని ఆదేశించింది. దీంతో నేటి నుంచి ఐబొమ్మ రవి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.


Tags:    

Similar News