Telangana : నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.

Update: 2025-12-18 07:42 GMT

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందచేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు బాంబు పేలుతుందంటూ నాంపల్లి కోర్టుకు ఈ మెయిల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

తనిఖీలు నిర్వహించడంతో...

తనిఖీలు నిర్వహించారు.బాంబు స్వ్కాడ్, డాగ్ స్క్కాడ్ లు తనిఖీలు నిర్వహించాయి. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైారా తీస్తున్నారు. నాంపల్లి కోర్టులోని సిబ్బందిని, న్యాయవాదులను బయటకు పంపిన తర్వాత కోర్టు లోపల, పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి బాంబులు లేవని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News