అల్లు అరవింద్ ఇంట విషాదం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణించారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం వయసు 94 సంవత్సరాలు.ఈరోజు తెల్లవారుజామున చివరిశ్వాస వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముంబయిలో సినిమా షూటింగ్ లో ఉన్న అల్లుఅర్జున్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.
అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం...
ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవి అత్త గారైన కనకరత్నం మరణించడంతో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అరవింద్ నివాసానికి వచ్చి ఆమె పార్ధీవదేహానికి నివాళులర్పిస్తున్నారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.