హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటన

నేడు, రేపు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటన కొనసాగుతుంది.

Update: 2025-12-20 04:20 GMT

నేడు, రేపు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటన కొనసాగుతుంది. నేడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సుకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ హాజరు కానున్నారు. రేపు కన్హా శాంతివనంలో ధ్యాన దినోత్సవానికి హాజరు కానున్నారు. ఈరోజు హైదరాబాద్ కు చేరుకునే ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలకనున్నారు.

పర్యటన సందర్భంగా...
ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అలాగే ఆయన బస చేసే ప్రాంతంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెళ్లే మార్గంలో ముందుగా ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటనకు వస్తుండటంతో బీజేపీ నేతలు కూడా పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.


Tags:    

Similar News