తెలంగాణలో 41 మంది మావోయిస్టులు లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 41 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు

Update: 2025-12-19 11:41 GMT

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 41 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారు 24 తుపాకులు, 733 రౌండ్లు అప్పగించారు. మావోయిస్టు కంపెనీ ప్లాటూన్ కమిటీ మెంబర్‌, డివిజనల్ కమిటీ మెంబర్‌ స్థాయి )కి చెందిన ఆరుగురు సీనియర్‌ నాయకులు సహా మొత్తం 41 మంది అండర్‌గ్రౌండ్‌ కేడర్లు తెలంగాణ డీజీపీ బి. శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.

ఆయుధాలు అప్పగించిన...
లొంగుబాటు సమయంలో వారు 24 తుపాకులు అప్పగించారు. లొంగుబాటు చేసిన కేడర్లు హింసను త్యజిస్తూ ప్రధాన స్రవంతిలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. మీడియా ఎదుట వారిని ప్రవేశపెడుతూ డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ లొంగుబాటు మావోయిస్టుల సంస్థాగత బలం, మనోధైర్యం, నాయకత్వ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. లొంగుబాటు ప్రక్రియలో భాగంగా 733 లైవ్‌ రౌండ్లు, వివిధ కాలిబర్ల గుండ్లు, ఎనిమిది బీజీఎల్‌ షెల్స్‌ కూడా అప్పగించినట్లు తెలిపారు. ఆయుధాల అప్పగింతతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఆపరేషన్‌, యుద్ధ సామర్థ్యం గణనీయంగా తగ్గిందన్నారు.


Tags:    

Similar News