పోన్ ట్యాపింగ్ కేసులో నేటి నుంచి మరో సారి విచారణ

పోన్ ట్యాపింగ్ కేసులో నేటి నుంచి మరో సారి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ జరపనుంది

Update: 2025-12-20 04:02 GMT

పోన్ ట్యాపింగ్ కేసులో నేటి నుంచి మరో సారి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ జరపనుంది. ప్రభాకర్ రావు ను సిట్ బృందం విచారణ చేయనుంది. నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ భేటీ జరిగింది. ప్రభాకర్ రావు వ్యవహారం లో కీలకలం గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మారడంతో ఆ దిశగా నేటి నుంచి సిట్ అధికారలు విచారణ చేయనున్నారు.

కొత్త గా ఏర్పడిన సిట్...
ఎవరి ఆదేశాల మేరకు పోన్ ట్యాపింగ్ చేశారు అన్న దాని పై విచారణ కొనసాగనుంది. డిసెంబర్ 26 వ తేదీ వరకు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిసెంబరు 26వ తేదీ వరకూ విచారణ చేపట్టాలని ఆదేశించడంతో ఈ ఆరు రోజులు సిట్ అధికారులు విచారణలో కీలక విషయాలను ప్రభాకర్ రావు నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు.


Tags:    

Similar News