Hyderabad : ఎస్.బి.ఐ వద్ద కాల్పుల ఘటన.. నిందితులు తప్పుదోవ పట్టించారా?

హైదరాబాద్ లోని కోఠి ఎస్.బి.ఐ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

Update: 2026-02-02 05:02 GMT

హైదరాబాద్ లోని కోఠి ఎస్.బి.ఐ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులను తప్పుదోవపట్టించే విధంగా నిందితులు కాచిగూడ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి పాతబస్తీ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు రైల్లో వెళ్లినట్లు డ్రామాలు ఆడినట్లు గుర్తించారు.

కాచిగూడ నుంచి...
అయితే నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరిగి ఆటోలో సిటీలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఒక రోజు తర్వాత నిందితులు ఇద్దరూ నగరం విడిచిపరారయి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఏ ఏ రాష్ట్రాలకు నిందితులు వెళ్లి ఉంటారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎస్.బి.ఐ వద్ద కాల్పులు జరిపి వ్యాపారి వద్ద ఆరు లక్షలు దోచుకెళ్లిన కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.


Tags:    

Similar News