బాణాసంచా పేలడంతోనే ట్యాంక్ బండ్ లో పడవలు దగ్దం

హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణం బాణ సంచా పేలడమేనని పోలీసులు తెలిపారు

Update: 2025-01-27 01:50 GMT

హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణం బాణ సంచా పేలడమేనని పోలీసులు తెలిపారు. భారతమాతకు మహా హారతి ముగింపు కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్ లోని బోట్ల నుంచి బాణసంచాల పేల్చుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. పడవలు మొత్తం దగ్దం అయ్యాయి. ప్రమాద సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకడంతో ప్రాణాలు దక్కాయి.

ఐదుగురు నీళ్లలోకి దూకి...
భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిన్న హుస్సేన్ సాగర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వంటి వీఐపీలు కూడా హాజరయ్యారు. వారు అలా వెళ్లిపోయిన మరు క్షణం ఈ ప్రమాదం జరిగింది. కార్యక్రమాన్ని ముగించే సందర్భంలో ఐదుగురు సిబ్బంది జెట్టీ ద్వారా బాణా సంచా పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావాడంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News