Hyderabad : ఈరోజు ఇటు వెళ్లకపోవడమే మంచిది.. వెళితే చిక్కుకుపోతారు
హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic restrictions in hyderabad
హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తుండటంతో ఉదయం పదకొండు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు ప్రధానంగా బేగంపేట మార్గంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు చెప్పారు.
పబ్లిక్ స్కూల్ కు...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం నిన్న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకోసం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బొల్లారం లోని రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరి రాష్ట్రపతి బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చేరుకుంటారు. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వాహనదారులు ఇతర మార్గాల నుంచి వెళ్లవచ్చని, ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు.