హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ

Update: 2022-07-02 11:16 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడం కోసం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరారు. మరోవైపు హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యానని ట్వీట్ చేశారు. షెడ్యుల్‌ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా మోదీ హైదరాబాద్ కు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. హైదరాబాద్‌ చేరుకున్న నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గవర్నర్‌ తమిళసైతో పాటు ఇతర బీజేపీ నాయకులు ఆహ్వానిస్తున్న ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. 'డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం' అని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయింది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులందరూ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.


Tags:    

Similar News