Hyderabad : కోకాపేట్ లో భూములను కొనలేమా?
హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి.
హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి. ఎకరం ధర 137.25 కోట్ల రూపాయలు పలికింది. హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో అత్యధిక ధరకు భూములను కొనుగోలు చేశారు. కోకా పేట్ భూములకు ఇంత భారీ ధర పలకడంతో ప్రభుత్వ వర్గాలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి అదనంగా ఆదాయం కూడా లభిస్తుందని చెబుతున్నాయి.
ఎకరం ధర...
ఎకరం ధర 137.25 కోట్ల రూపాయలు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18 స్థలాలకు ఈ వేలం జరిగింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు ఈ వేలం నిర్వహించింది. మొత్తం 9.9 ఎకరాలను 1,355 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. గతంలోనూ కోకాపేట్ నియోపోలీస్ వద్ద ఎకరం ధర వంద కోట్ల రూపాయలకు పైగానే పలికింది.