పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టాలని బాచుపల్లి వాసుల నిరసన
హైదరాబాద్ లో బాచుపల్లి ప్రాంతంలోని ప్రజలు ఆదివారం పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన నిర్వహించారు
హైదరాబాద్ లో బాచుపల్లి ప్రాంతంలోని ప్రజలు ఆదివారం పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన నిర్వహించారు. కాలుష్యంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని, అనేక వ్యాధులు వస్తున్నాయని, ఈ ప్రాంత వాసులు దుర్గంధంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టాలని, పరిశ్రమల కాలుష్యాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించాలని వారు కోరుతున్నారు.
కాలుష్యానికి వ్యతిరేకంగా...
పారిశ్రామిక కాలుష్యంతో మౌలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, కార్ఖానాల నుండి వస్తున్న రసాయనిక వాసన మరియు విషవాయువుల వల్ల కళ్ల మండడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన చెందారు. కాలుష్య నియంత్రణ మండలి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ, "కాలుష్యాన్ని అరికట్టండి" మరియు "PCB కో జగావో, కాలుష్యాన్ని భగావో" అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు.