న్యూ ఇయర్ వేడుకలకు మందుబాబులు తాగిన మద్యం విలువ ఎన్ని కోట్లంటే?
కొత్త ఏడాదికి మందుబాబులు ఫుల్లుగా తాగేశారు.
కొత్త ఏడాదికి మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. వేల కోట్ల రూపాయలు మందును గొంతులో దింపుకున్నారు. నిన్న ఒక్కరోజు హైదరాబాద్ నగరంలో దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రాధమికంగా అందిన సమాచారం. వైన్ షాపులు పన్నెండు గంటల వరకూ తెరిచే ఉంచారు. బార్లు, పబ్ లు అర్ధరాత్రి ఒంటి గంట వరకూ నడుపుకోవడానికి అనుమతించారు.
మద్యం ఏరులై పారడంతో...
ఇక ఈవెంట్లలో మద్యం ఏరులై పారింది. ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే తమకు కావాల్సిన మద్యాన్ని డిస్టలరీల నుంచి కొనుగోలు చేశారు. అలాగే బార్లు, వైన్ షాపుల్లోనూ మందుబాబులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. దీంతో ఒక్క హైదరాబాద్ నగరంలోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే మద్యం అమ్మకాలు జరిగాయని అనధికారికంగా తెలుస్తోంది.