నెలకు 5.4 కోట్ల అద్దె.. ఇంత డిమాండ్ ఉందా?

అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాల కోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్‌ సెంటారస్‌ బిల్డింగ్‌లో 2.65 లక్షల

Update: 2025-08-26 13:00 GMT

అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాల కోసం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్‌ సెంటారస్‌ బిల్డింగ్‌లో 2.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ ను భారీ మొత్తం చెల్లించి లీజుకు తీసుకుంది. టేబుల్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ నుంచి ఫీనిక్స్‌ సెంటారస్ లోని 3,4 అంతస్థులను మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ జూలై 1 నుంచి ఒప్పందం అమలులోకి వచ్చింది. చదరపు అడుగుకు 67 రూపాయల చొప్పున మొత్తం స్థలానికి మైక్రోసాఫ్ట్‌ నెలకు 1 కోటి 77 లక్షల కనీస అద్దె, నిర్వహణ వ్యయాలు, ఇతర చార్జీలు కలిపి మొత్తం 5 కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లించనుంది. ఏటా అద్దె 4.8 శాతం పెరగనుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మైక్రోసాఫ్ట్‌ 42.15 కోట్ల రూపాయలు జమ చేశారు. టేబుల్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ ఈ స్థలాన్ని బిల్డింగ్‌ యజమాన్య సంస్థ ఫీనిక్స్‌ టెక్‌ జోన్‌ నుంచి అంతకు ముందు లీజుకు తీసుకుంది

Tags:    

Similar News