Ramdan : నేటి నుంచి రంజాన్ మాసం ప్రారభం
నెలవంక నిన్న కనిపించడంతో నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అయింది
నెలవంక నిన్న కనిపించడంతో నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అయింది. ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండే అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహించే పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి మొదలు కావడంతో అన్ని మసీదులను అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలుంటారు.
ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో...
రంజాన్ మాసం ప్రారంభమయిన సందర్భంగా ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే విధుల నుంచి వెళ్లేలా వెసులు బాటు కల్పించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో అన్ని మసీదుల్లో ప్రత్యేక అలంకరణలు చేయడమే కాకుండా విద్యుత్తు దీపాలతో అలంకరించారు.