ఎల్బీనగర్ అండర్ పాస్ నేడు ప్రారంభం

ఎల్పీనగర్ లోని అండర్ పాస్ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.

Update: 2022-03-16 03:01 GMT

ఎల్పీనగర్ లోని అండర్ పాస్ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. అండర్ పాస్ తో పాటు 29 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను కూడా మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ రెండు అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీరనుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఈనాటిది కాదు. ఈ సమస్య నుంచి ప్రజలను బయటపడేసేందుకు ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు.

ట్రాఫిక్ రద్దీని....
అందులో భాగంగానే ఎల్బీ నగర్ లో అండర్ పాస్ తో పాటు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. దీనివల్ల భాగ్యనగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అండర్ పాస్ 490 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇక బైరామల్ గూడ ఫ్లైఓవర్ నిర్మించడంతో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవడం మరింత సులువుగా మారనుంది. ఆరంఘర్, మిధాని నుంచి వచ్చే ట్రాఫిక్ ను నివారించేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది.


Tags:    

Similar News