Weather Report : తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. వర్షాలు పడేది ఇక్కడే
తెలంగాణలో వర్షాలు మూడు రోజుల పాటు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
rain alert in telangana
తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆ ప్రభావం లేకున్నా...
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో వర్షం తెలంగాణలో కూడా పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ తుపాను తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపదని కూడా చెప్పారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొంది.