Breaking : హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. అధికారులను అప్రమత్తం చేసింది.
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. అధికారులను అప్రమత్తం చేసింది. మరో రెండు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మరో రెండు గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్షం పడే అవకాశముందని తెలపడంతో నగరంలో అన్ని ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అలెర్ట్ చేశారు. కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.
ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ...
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చీకట్లు అలుముకున్నాయి. మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నాయి. ఆఫీసులకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చే సమయం అవుతుండటంతో నగరంలో ట్రాపిక్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని భావించి పోలీసు కమిషనర్ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచపోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రజలు వీలయినంత వరకూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా చెప్పారు.