Hyderabad : హైదరాబాదీలకు హై అలెర్ట్.. మూడు గంటల్లో భారీ వర్షం

హైదరాబాద్ లోని ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Update: 2025-04-18 13:19 GMT

హైదరాబాద్ లోని ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రానున్న మూడు గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వీలయినంత వరకూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. అలాగే కార్యాలయాలు, దుకాణాల నుంచి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఎవరూ తొందరపడి మ్యాన్ హోల్ మూతలు తెరవద్దని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలని...
రోడ్డుపై నీరు పెద్దయెత్తున నిలుస్తాయని, నీరు బయటకు వెళ్లేంత వరకూ వేచిఉండాలని సూచించారు. అంతే తప్ప సాహసాలుచేయవద్దని కోరింది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రికి అలెర్ట్ గా ఉండాలని కూడా కోరింది. భారీ వర్షంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. చిరు వ్యాపారులు, ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలని కోరింది.


Tags:    

Similar News