హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశం

హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది.

Update: 2025-06-29 02:36 GMT

ఈరోజు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. జూలై 4 వ తేదీన హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న సభ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశం జరగనుంది.

ఖర్గే పర్యటన నేపథ్యంలో...
ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, జీహెచ్ ఎంసీ మేయర్ , జిల్లా అధ్యక్షులు , కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు , పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు , ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లో జరిగే సభ విజయవంతం పై ముఖ్య నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు దిశా నిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News