Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఒక గోదాము తగలబడిపోయింది

Update: 2025-06-21 11:56 GMT

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్ లో ఒక వివాహ వేడుకలకు సంబంధించిన సామాగ్రి ఉన్న ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోదాములో జరిగిన ఈ అగ్నిప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పహాడీ షరీఫ్ లో ఉన్న...
మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు, ఇళ్లకు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం కారణంగా ఆస్తినష్టం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.


Tags:    

Similar News