KPHB భూముల ధరలు.. భారీనే!!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎకరా స్థలాన్ని 65 కోట్ల 34 లక్షలకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఆన్‌లైన్ వేలం ద్వారా కొనుగోలు చేశారు. హౌసింగ్ బోర్డు అధికారులు నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 11 బిడ్లు దాఖలయ్యాయి. నలుగురు బిడ్డర్లు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని రాజీవ్ స్వగృహ గేటెడ్ కమ్యూనిటీల్లోని ఫ్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి 26కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.