Hyderabad : ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. నిమజ్జనం ముగిసింది

Update: 2025-09-06 07:53 GMT

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. నిమజ్జనం ముగిసింది. ట్యాంక్ బండ్ లోని క్రేన్ నెంబరు 4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. ఉదయం పూజలు అనంతరం ఎనిమిది గంటలకు ప్రారంభమై ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సచివాలయం మీదుగా ట్యాంక్ బంద్ క్రేన్ నెంబరు ఫోర్ వద్దకు చేరుకుంది. శోభాయాత్ర దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టింది.

నాలుగున్నర గంటల సమయం...
ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న వెంటనే ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అరగంట సేపు పూజలు నిర్వహించిన అనంతరం, ట్రాలీపై ఉన్న గణపతి విగ్రహాన్ని క్రేన్ పైకి చేర్చేందుకు దాదాపు అరగంట సమయం పట్టింది. భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకన్నారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్నిచూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్ బండ్ ప్రాంతమంతా భక్త జనసంద్రంతో నిండిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News