ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2025-12-29 02:24 GMT

ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రహ్లాద్‌ అనే వ్యక్తి డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇమంది రవి తీసుకున్నట్లు గుర్తించారు. ప్రహ్లాద్‌ తన రూమ్‌మేట్‌ అని గతంలో ఇమంది రవి పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణను ప్రారంభించారు.

ప్రహ్లాద్ పేరిట...
బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి పోలీసులు విచారించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే... ప్రహ్లాద్‌ను పోలీసులు విచారించారు. ఇమంది రవి ఎవరో తనకు తెలీదని పోలీసులకు చెప్పిన ప్రహ్లాద్ చెప్పడంతో అతని పేరుపై పాన్, డ్రైవింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన పేరుతో రవి పాన్‌, లైసెన్స్‌ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యాయని ప్రహ్లాద్ చెప్పారు.


Tags:    

Similar News