నేడు మూడో్ రోజు నమ్రత విచారణ
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యజమాని నమ్రత విచారణ నేడు మూడో రోజు కొనసాగనుంది
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యజమాని నమ్రత విచారణ నేడు మూడో రోజు కొనసాగనుంది. గత రెండు రోజుల నుంచి నమ్రతను పోలీసులు విచారించారు.సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరిగిన అక్రమాలపై విచారించారు. సరోగసి చేస్తామని నమ్మించి పేదల పిల్లలను తీసుకు వచ్చి విక్రయించడంపై పోలీసుల ప్రధానంగా విచారణ చేస్తున్నారు.
సహకరించిన అధికారులపై...
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వద్ద లక్షల రూపాయలు నగదు వసూలు చేయడమే కాకుండా అక్రమాలకు పాల్పడటమే కాకుండా, వారిని బెదిరించిన వైనంపై కూడా విచారణ చేస్తున్నారు. నమ్రత మాత్రం తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నారు. కానీ నమ్రతకు సహరించిన వారిపై పోలీసులు నేడు విచారణ చేయనున్నారు.