రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Update: 2022-09-24 08:24 GMT

ఆదివారం నాడు నగరంలో గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సుమారు వెయ్యి మంది సైక్లిస్టులు కేబుల్‌ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్‌ సంఘం నిర్వాహకులు తెలిపారు. ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోటరీ, కేబుల్‌ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గచ్చిబౌలి రోడ్డు నంబర్‌-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్‌ ఇనార్బిట్‌ మాల్‌, సీవోడీ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయన్నారు.

ఉప్పల్ లోనూ పలు ఆంక్షలు:
ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఉప్పల్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని.. గేట్ నెంబర్ 1 ద్వారా విఐపీ, వివిఐపీ లకోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్ లో 1400 ఫోర్ వీలర్స్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసామన్నారు. స్టేడియం చుట్టూ మూడు జంక్షన్స్ ఉన్నాయని వివరించారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని తెలిపారు. ఏక్ మినార్ దగ్గర ఎలాంటి పార్కింగ్ కు అనుమతి లేదని పేర్కొన్నారు.


Tags:    

Similar News